కమాండ్ పోస్టులకు కూడా మహిళలు అర్హులే….

మన భారత సైన్యంలో ఆడవాళ్లు పనిచేయడం కొత్త కాదు. అయితే కమాండర్ పోస్టులకు వాళ్లు దూరంగా ఉంటున్నారు. కమాండ్ పోస్టుల్లో వాళ్లను నియమించడానికి అనేక సాకులు చెబుతూ ఇంతకాలంగా టైం పాస్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కమాండ్ పోస్టులకు కూడా మహిళలు అర్హులేనని తేల్చి చెప్పింది. మగవాళ్లతో సమానంగా మహిళలకు అన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రపంచంలోని అనేక దేశాల మిలటరీలో మగవాళ్లతో సమానంగా మహిళలు డ్యూటీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మగవాళ్లకంటే ఎక్కువ టాలెంట్ చూపుతూ సైన్యంలో పై స్థాయికి వెళుతున్నారు. అలాంటి కొన్ని దేశాల పరిస్థితిని చూద్దాం.
అల్బేనియాలో…
అల్బేనియా చిన్న దేశమైనా అక్కడి సైన్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మామూలు సైనికులుగానే కాదు ఆఫీసర్లుగానూ కొనసాగుతున్నారు. బ్రిగేడియర్–జనరల్ అనేది అక్కడి సైన్యంలో చాలా పెద్ద పోస్టు. ఎన్నో ఏళ్ల సర్వీసుతో పాటు యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు కనబరచిన వాళ్లు ఈ పోస్టువరకు వెళ్లగలుగుతారు. ఇంత ముఖ్యమైన పోస్టులో మనుషఖ్ షేహు అనే మహిళ ఉన్నారు. ‘జనరల్ స్టాఫ్’ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి కాగానే ఓ సాధారణ సైనికురాలిగా మనుషఖ్ షేహు ఆర్మీలో చేరారు. 1984లో ఆఫీసర్ అయ్యారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2016 లో బ్రిగేడియర్ జనరల్ పోస్టుకు ప్రమోట్ అయ్యారు.
కెనడాలో…
కెనడా ఆర్మీలో త్రీ స్టార్ హోదా పొందిన తొలి మహిళగా క్రిస్టీన్ వైట్ క్రాస్ రికార్డు సృష్టించారు. 2015లో ‘రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్’ లెఫ్టినెంట్ జనరల్‌గా క్రిస్టీన్‌కు ప్రమోషన్ లభించింది. ఇంజనీరింగ్ చదివిన క్రిస్టీన్ 1982లో కెనడా ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చి, కమాండింగ్ ఆఫీసర్‌గా, చీఫ్ మిలటరీ ఇంజనీర్‌గా అనేక పెద్ద పోస్టుల్లో పనిచేశారు.
ఇజ్రాయెల్‌లో వీరిదే హవా
ఈ దేశంలో మహిళలందరికి మిలిటరీ ట్రెయినింగ్ తప్పనిసరి. రెండేళ్లపాటు ఈ శిక్షణ ఉంటుంది. సైన్యంలో వివిధ ర్యాంకుల్లో దాదాపు నూటికి 40 మంది మహిళలే ఉంటారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మహిళలు పెద్ద సంఖ్యలోఉన్నది ఇజ్రాయెల్ సైన్యంలోనే. ఈ దేశంలోని మహిళలు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతారు. వీళ్లు అన్ని విభాగాల్లోనూ పురుషులకు తీసిపోని రీతిలో పనిచేస్తారు.
డెన్మార్క్‌లో…
డెన్మార్క్ సైన్యంలో జనరల్ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళగా లోనె త్రెహోల్ట్ రికార్డు సృష్టించారు. అలాగే తొలి లెఫ్టినెంట్ కర్నల్, తొలి కర్నల్‌గా నియమితురాలైన మహిళగా ఆమె రికార్డులు సృష్టించారు. ఆల్బోర్గ్ ఎయిర్ బేస్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా అనేక కీలకమైన డ్యూటీలు ఆమె చేశారు.
బెల్జియం సైన్యంలో…
బెల్జియం సైన్యంలో కొరినే ఫాట్ అనే మహిళ బ్రిగేడియర్–జనరల్ స్థాయి వరకు వెళ్లారు. 1982లో ఆర్మీలో చేరి, 2000లో లెఫ్టినెంట్ కర్నల్ అయ్యారు. ప్రస్తుతం బ్రిగేడియర్ జనరల్ హోదాలో ‘డిఫెన్స్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్’ డీజీగా పనిచేస్తున్నారు.
చెక్ ఆర్మీలో…
చెక్ రిపబ్లిక్ ఆర్మీలో లెంకా స్మెర్ దోవా అనే మహిళ రెండు రికార్డులు సృష్టించారు. సైన్యంలో తొలి మహిళా కర్నల్ కావడం ఒక రికార్డు అయితే, తొలి మహిళా జనరల్ కావడం మరో రికార్డు. మూడేళ్ల కిందట ఆమెకు బ్రిగేడియర్ జనరల్‌గా ప్రమోషన్ లభించింది. 1984లో ఆర్మీలో చేరిన లెంకా ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ బ్రిగేడియర్ జనరల్ స్థాయి వరకు ఎదిగారు.
బెల్జియం సైన్యంలో…
బెల్జియం సైన్యంలో కొరినే ఫాట్ అనే మహిళ బ్రిగేడియర్–జనరల్ స్థాయి వరకు వెళ్లారు. 1982లో ఆర్మీలో చేరి, 2000లో లెఫ్టినెంట్ కర్నల్ అయ్యారు. ప్రస్తుతం బ్రిగేడియర్ జనరల్ హోదాలో ‘డిఫెన్స్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్’ డీజీగా పనిచేస్తున్నారు.
డెన్మార్క్‌లో…
డెన్మార్క్ సైన్యంలో జనరల్ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళగా లోనె త్రెహోల్ట్ రికార్డు సృష్టించారు. అలాగే తొలి లెఫ్టినెంట్ కర్నల్, తొలి కర్నల్‌గా నియమితురాలైన మహిళగా ఆమె రికార్డులు సృష్టించారు. ఆల్బోర్గ్ ఎయిర్ బేస్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా అనేక కీలకమైన డ్యూటీలు ఆమె చేశారు.
నార్వేలో…
నార్వే సైన్యంలో క్రిస్టిన్ అనే మహిళ మేజర్ జనరల్ పోస్టు వరకు ఎదిగారు. సైప్రస్‌లోని ‘యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్’కు కమాండర్‌గా ఆమె పనిచేశారు. అంతకుముందు నార్వే డిఫెన్స్ స్టాఫ్, హోం గార్డు లాంటి విభాగాలకు కమాండర్‌గా పనిచేశారు.
స్లొవేనియాలో…
స్లొవేనియా ఆర్మీలో అలెంకా అనే మహిళ మేజర్ జనరల్ స్థాయికి ఎదిగారు. రెండేళ్ల కిందటే ఇంత పెద్ద పోస్టు ఆమెకు లభించింది. స్లోవేనియా సైన్యంలో ఈ పోస్టు వరకు ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. 1991లో ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చిన అలెంకా క్రమంగా పైకెదిగారు.
జర్మనీలో…
జర్మనీ సైన్యంలో గెసిన్ క్రుగెర్ అనే మహిళ జనరల్ స్థాయి వరకు ఎదిగారు. డాక్టర్ కోర్సు పూర్తి చేసిన గెసిన్ క్రుగెర్ 1987లో ఆఫీసర్‌గా సైన్యంలో జాయిన్ అయ్యారు. మెడికల్ సర్వీసెస్ విభాగంలో అనేక హోదాల్లో పనిచేశారు.
ఫ్రాన్స్ లో 18 మంది జనరల్స్
ఫ్రాన్స్ ఆర్మీలో మహిళల హవా బాగా ఎక్కువ. ప్రస్తుతానికి ఫ్రాన్స్ సైన్యంలో 18 మంది మహిళా జనరల్స్ ఉన్నారు. వీళ్లలో ఒకరు ఆర్మీలోనూ, ముగ్గురు ఎయిర్ ఫోర్స్లోనూ, ఒకరు నేవీలోనూ, నలుగురు మిగతా చోట్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.