వంగ‌వీటి కుటుంబం వైసిపిలోకి మ‌ళ్లీనా?

దివంగత కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా 2004 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించినా ఆయ‌న వేసిన త‌ప్ప‌ట‌డుగులు అన్నీ ఇన్నీ కావు. ఇదే ఆయ‌న‌ కెరీర్ అగమ్య గోచరంగా మార్చేసింది. 2009 ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి ఎన్నో ఆశ‌ల‌తో ప్రజారాజ్యం నుంచి పోటీచేసి రాధా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి చ‌వి చూడాల్సి వ‌చ్చింది. త‌దుప‌రి ఆ పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేసినా అనూహ్యంగా వైసిపిలో చేరి 2014లో ఆపార్టీ నుంచి  పోటీ చేసి మ‌రోసారి ఓట‌మి చ‌వి చూసాడు. ఇక గ‌త ఎన్నిక‌ల ముందే సెంట్ర‌ల్ సీటు ఇవ్వ‌లేద‌న్న కోపంతోనే రాధా జగన్‌తో విభేదించి  వైసిపి నుంచి బయటకు వచ్చి టిడిపిలో చేరారు. 

అయితే వంగ‌వీటి చిరకాల రాజకీయ శత్రువు గా భావించే టిడిపిలో రాధా చేరటం న‌చ్చ‌కున్నా, తొలి నాళ్ల‌లో వంగ‌వీటి భార్య‌కు టిడిపి రాజ‌కీయ బిక్షప్ర‌సాదించడంతో ఆ కుటుంబ అభిమానులకు ఎంత మాత్రం నచ్చకున్నా రాధా వెంటే న‌డిచారు కొంద‌రు. 

అయితే ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో త‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం కావ‌టంతో ఆమ‌ధ్య జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌ల‌సి న‌డిచే ప్ర‌య‌త్నం చేసారు. కానీ అదెందుకో ఫ‌లించ‌లేదు. తాజాగా త‌న అనుంగు మిత్రుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గా వంగ‌వీటిని సైతం వైసీపీలోకి తీసుకు వెళ్లేందుకు మంత్రి కొడాలి నాని ప్ర‌య‌త్నాలు ఆరంభించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే  రాధా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తానే దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్తానంటూ ప్ర‌క‌ట‌న చేయ‌గా  జిల్లాకే చెందిన మ‌రో మంత్రి పేర్ని నాని  కూడా రాధాతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.  మ‌రి రాధా ఏనిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.