సామ్ ఖాతాలో కాస్ట్‌లీ బ్రాండ్స్

స్టార్ హీరోయిన్ గా.. సామాజిక సేవా కర్తగా సమంత రేంజ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. దీనికి అక్కినేని కోడలు అన్న అదనపు బ్రాండ్ అదనపు బలం. ఇప్పటికే పలు ప్రఖ్యాత బ్రాండ్లు సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. బిగ్ సి, హెల్త్ .. ఫిట్ నెస్ … బంగారు వజ్రాభరణాల కంపెనీలు.. చేనేత అన్నిటికీ సమంత బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రఖ్యాత కుర్ కురే బ్రాండ్ తో బిగ్ డీల్ కు సంతకం చేశారని తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన బుల్లితెరపైనా ఎయిర్ కానుంది. మరోవైపు ఫ్యాషన్ & స్టైల్ కి సంబంధించి బ్రాండ్ ప్రమోషన్స్ లో సామ్ క్రేజు ఏం రేంజులో ఉందో తెలియజేయాలంటే మరో తాజా డీల్ గురించి ప్రస్థావించాలి. ప్రఖ్యాత లూయిస్ వూట్టన్ బ్రాండ్ కి సామ్ ప్రచారం చేస్తున్నారు. అందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ జోరుగా వైరల్ అవుతోంది.  మొత్తానికి బ్రాండ్స్ కేరాఫ్ అక్కినేని కోడలు అన్న పాపులారిటీ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది. సమంత నటించిన మజిలీ రిలీజ్ కి వస్తోంది. ఓ బేబి చిత్రం ఇప్పటికే 50 శాతం పూర్తయిందని తెలుస్తోంది. అటుపైనా పలు తెలుగు, తమిళ చిత్రాలతో సమంత కెరీర్ ఫుల్ బిజీ.

Leave a Reply

Your email address will not be published.