పొత్తు ప్రయోజనం ఎవరికి ?
(1) కేసిఆర్ ఈ సంధిలో ప్రముఖ లబ్దిదారుడు, ఎందుకంటే వైకాపా తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో పోటికి విముఖంగా ఉన్న నేపథ్యంలో గంపగుత్తగా వైకాపా ఓట్లు తమ పార్టీకి పడుతాయని కేశీఆర్ ఆశాభావం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వైకాపా ఓట్లు తన పార్టీకి పడటం అదనపు సీట్లు గెలిచినట్లుగా ఆ పార్టీకి భావన. తెదేపా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో పూర్తిగా అంతర్ధానం, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కలిసివచ్చిన అంశాలు కేసీఆర్ గారికి అయినందున 17 సీట్లు గెలవడం ఖాయమని తన ఖచ్చితమైన అంచనా. ఇకపోతే ఈ 17 సీట్లు వచ్చే కేంద్ర ప్రభుత్వానికి హంగ్ రూపేణా కీలకం అవ్వబోతోందని కేసీఆర్ ఆత్మవిశ్వాసం. ఇకపోతే జనసేన తెలంగాణలో పోటీ కేసీఆర్ గారికి ఈ కొత్త సమీకరణంతో అంత బెంగ పడే పరిస్థితి లేదని అనుకోవడం సబబు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కేసీఆర్ ఉపప్రధానిపై కన్ను. ఇన్ని ప్రయోజనాలు కేసీఆర్ గారికి చేకూర్చే జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖుడు ఎవరు ఉండరు. పులివెందుల బిడ్డ, వైయెస్ బిడ్డ పులి బదులు మేక అవ్వడం రాయలసీమకే అరిష్టం.
(2) ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో సంధి రూపేణా చంద్రబాబు ఉనికికి ఎసరు పెట్టే ఒక ప్రణాళికగా కేసీఆర్ తిరుగు బహుమానంగా అనుకోవడం ప్రజలు భావిస్తారని తనకున్న లెక్క. ఏదో సాధించానని ఒక శాడిజం పక్కా.
మొత్తానికి అటు చూసినా ఇటు చూసినా కేసీఆర్ ప్రధాన లబ్దిదారుడు అని ఈ మొత్తం ప్రహసనములో ప్రతియొక్కరు అనుకొనేలా చేస్తుంది.
ఇకపోతే వీరిద్ధరి నడుమ పొత్తు వైకాపాకు ఏ విధంగా ఏపి ఎన్నికలలో అనుకూల ప్రతికూల అంశాలు కొంచం వివరంగా చర్చిద్దాం.
అనుకూల అంశాలు – శూన్యం
ప్రతికూల అంశాలు ఇవి:
ఏపిలో వైకాపాపై ఈ పొత్తుపై ప్రత్యర్థ పార్టీల దాడి తీవ్రస్వరం పెంచుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్న గారు స్వర్గీయులు వైయెస్ కేసీఆర్ గారికి బద్ద శత్రువు. వారిద్దరికి పచ్చగడ్డేస్తే మండేంత వైరం ఉండేది. వారిద్దరి మధ్యన వ్యక్తిగత దూషణలు ఒకానొకప్పుడు పరాకాష్ట చేరినవి. వైయెస్ మరణం కేసీఆర్ గారు ఇంచుమించు ఒక పండుగలా జరుపుకొన్నారు. ఆఖరికి వైయెస్ మరణం తాళలేక తన అభిమానులు మృతులైతే జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు ఎన్నో అంతరాయాలు సృష్టించన వారు కేసీఆర్ గారు. జగన్ ఎంతో గొప్పగాను ఎన్నో పర్యాయాలు నాన్నగారి ఆశయాలను తను కొనసాగిస్తాను తన శ్రేణులకు ప్రమాణం చేసారు. అసలు మూలాలానే జగన్మోహన్ రెడ్డి విస్మరించడం వచ్చే కొద్ది రోజుల్లో వైకాపా శ్రేణులు మండిపడే రోజు వస్తుంది. కేసీఆర్ స్వార్థపూరిత ప్రయోజనాలకై తమ అధినేతను వాడుకుంటున్నాడని ప్రతి వైకాపా కార్యకర్త తూలనాడేలా చేస్తుంది. ఇకపోతే వైకాపా TRS పార్టీతో పొత్తు ఏపిలో పార్టికి ఆత్మహత్యాసదృశ్యంగా, శాశ్వత రాష్ట్ర బద్ద శత్రువుగ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో అసమ్మతి సెగలకు అవకాశం ఉండేలా చేస్తుంది.
ఏది ఏమైనా కేసీఆర్ గారికి ఈ పొత్తు పెద్ద ప్రయోజనకారిగా, జగన్మోహన్ రెడ్డి ఒక మేకపొతులా ఆయనకు బలిలా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా విశ్లేషణ చెబుతోంది.
తెదేపా ఎలా బ్రష్టు పట్టిందో, వైకాపా అదే త్రోవలో పోవడం జనసేనకు అదనపు బలం కాబోతుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. జనసైనికులు ప్రతియొక్కరు హర్షించదగ్గ విషయం.
ఇక తెదేపా జనసేన విడివిడిగా వైకాపా కేసీఆర్ కలయికపై సరికొత్త ప్రణాళికలతో సన్నద్ధమవుతారని ఆశిద్ధాం.