తిరుమలేశునికీ తప్పని కరోనా దెబ్బ


నిత్యం కిట‌కిట‌లాడే  తిరుమ‌ల కొండ‌లు కరోనా ప్రభావంతో భ‌క్తులు త‌క్కువై క్ష‌ణాల‌లో ద‌ర్శ‌నం అవుతోంది. క‌రోనా వైర‌స్‌ని సోక‌కుండా ఇప్ప‌టికే తిరుమ‌ల‌, తిరుప‌తితో స‌హా త‌న అనుబంధ దేవాల‌యాల‌లో అనేక వైద్య ప‌ర‌మైన ఏర్పాట్లు చేసింది టిటిడి. అయిన‌ప్ప‌టికీ భ‌క్తుల రాక  చాలా త‌గ్గుముఖం ప‌ట్టింది. 

పైగా  విద్యా సంవత్సరం చివ‌ర‌కి చేర‌టం, ప‌రీక్ష‌ల‌ సీజన్ ఆరంభ‌మ‌వుతుండ‌టంతో పాటు స్థానిక ఎన్నిక‌ల ప్ర‌భావం కూడా కొండ‌కు వ‌చ్చే భ‌క్త జ‌నం మీద క‌నిపించింది. కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న క్ర‌మంలో  సోమవారం అయితే, ఈ రద్దీ మరింతగా తగ్గిపోయింద‌ని టిటిడి వ‌ర్గాలు చెపుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published.