ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్….

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో షేర్ మార్కెట్లనే కాదు బీర్ల అమ్మకాలకు కూడా గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. దేశంలో ఇప్పటివరకు  ఈ వైరస్ బారిన పడ్డట్లు కేసులు నమోదు కాకున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోననే భయం ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. చైనా వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 100మందికి పైగా మృత్యువాత పాడ్డారనే వార్తలు వినిపించడంతో ఈ వైరస్, కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

ఈ బీరు తాగితే కరోనా వైరస్ మనకు కూడా సోకుతుందా అంటూ భారత్ లో బీరు ప్రియుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ బ్రాండ్ ను కొనుగోలు చేయటానికి భయపడుతున్నారు. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గుగూల్ ను ఆశ్రయిస్తున్నారు. కరోనా బీరు వైరస్, కరోనా బీరు తో వైరస్ సోకుతుందా అని టైప్ చేస్తూ.. వెబ్ సైట్లో వెతుకుతున్నారు.  ఈ ప్రశ్నలను సందిస్తున్న వారిలో భారత్ లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉండటం గమనార్హం. 

Leave a Reply

Your email address will not be published.