జగన్ నిర్ణయంపై స్పందించిన సీపీఐ నేత రామకృష్ణ

ఏపీ రాజధాని విషయంపై స్పందించారు సీపీఐ నేత రామకృష్ణ. సీఎం జగన్ ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు చేశారు. విజయవాడ ఐఎంసీ హాలులో ఆయన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను సేకరించి ఓ నివేదిక తయారు చేసి విడుదల చేస్తామని తెలిపారు. రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడుతు్న్నారని విమర్శించారు. అయితే, కేబినెట్ భేటీ 27వ తేదీన జరిగితే రాజధాని విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 26వ తేదీనే ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.