మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంకాంబినేష‌న‌లో సినిమా

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంకాంబినేష‌న‌లో  వ‌స్తున్న సినిమాలో న‌టీన‌టుల‌పై చాలా కాలంగా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య మా మీటింగ్‌లో చిరు – మోహ‌న్ బాబుల ఆలింగ‌నాలు చూసి,  చిరంజీవితో క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు (విలన్) తలపడుతున్నారంటూ వార్త‌లు ఆర‌ని నిప్పులా వ్యాపించాయి. దీనిని ఇరు వ‌ర్గాలు ఖండించ‌క పోవ‌టంతో నిజ‌మేన‌నుకున్నారంతా…. 1990లో వ‌చ్చిన ‘కొద‌మ‌సింహం’ త‌రువాత‌  కలిసి నటిస్తున్నారంటూ సామాజిక మీడియాలో క‌థ‌నాలు పుంఖ‌నాలుగా వండి వార్చేసారు. 
 
తాజాగా చిత్రబృందం వ‌స్తున్న క‌థ‌నాలు స‌రికావ‌ని  తేల్చేసింది.. చిరు మూవీలో మోహన్ బాబు నటించట్లేదు స్ప‌ష్టం చేసింది.  అయితే ఇటు ఈ సినిమాలో రామ్‌చరణ్ నటిస్తాడన్న వార్తపై కానీ   హీరోయిన్ ల ఎంపిక‌పై కానీ  యూనిట్‌ ఎటూ తేల్చక పోవ‌టం విశేషం.  మ‌రి రానున్న రోజుల్లో ఎన్ని ట్విస్టులిస్తారో చూడాలి.
 

Leave a Reply

Your email address will not be published.