సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు….

2015 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలచింది.ఈ సినిమాలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు ప్రేక్షకులన్ని కట్టిపడేసింది. నాగార్జున- రమ్యకృష్ణల కాంబినేషన్లో వచ్చిన సీన్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఈ సీక్వెల్ సినిమానికి తెరకెక్కే ప్రయత్నాలు పట్టాలెక్కబోతున్న దశలో నాగార్జున వ్యక్తిగత పనుల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఆపై షూటింగ్ ఆరంభమవుతుందన్న దశలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా అలాగేతో బిజీగా ఉండటం కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఇలా వాయిదాలు పడుతున్న సినిమాని ఈ మార్చిలో తిరిగి సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నారు నాగార్జున. ఈ క్రమంలోనే మరోమారు కళ్యాణ్ కృష్ణనిపిలిపించుకుని, స్క్రిప్ట్ పనులు ఫైనల్ చేసేలా చూస్తున్నట్టు ఫిలింనగర్ సమాచారం.
సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కావటంతో ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుండటంతో ఆ పాత్రని మరింతగా తీర్చి దిద్దే పనిలో ఉన్నారట. మన్మథుడు 2′ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన నేపథ్యంలో నాగ్ ఈ సారి హిట్ కొట్టి సత్తాచూపాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ సినిమా వేసవి కానుకగా జనం ముందుకు రావటం ఖాయం.