స‌రిలేరు ఇంట‌ర్వెల్ ట్విస్ట్ అలా ఉండ‌బోతుందా…?

హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం  `స‌రిలేరు నీకెవ్వ‌రు ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేష్ ఫ్యాన్స్ అంతా వెయ్యి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ అంతా ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ బిజీలో కాస్త బిజీగా ఉన్నారు.


అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆస్త‌క్తికర విషయాలు ఇండస్ట్రీలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి చిన్న చిన్న టాక్స్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని.. ఫస్టాఫ్ అంతా కామెడీ ట్రాక్‌తో సాగితే, ఇంటర్వెల్ నుంచి టర్న్ తీసుకుంటుందట. అందుకే, ఇంటర్వెల్ బ్యాంగ్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన‌ట్లు స‌మాచారం.


కర్నూలులోని కొండా రెడ్డి బురుజు (సెట్ వేశారు) ముందు మంచి మాస్ ఫైట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుందట. ‘మనదగ్గర బేరాలేవమ్మా’ అని మహేష్ టీజర్‌లో చెప్పిన డైలాగ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వస్తుందని టాక్. ఈ ఫైట్‌ను రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేశారని తెలిసింది. ఈ ఫైట్ మాత్రం సినిమాకే హైలైట్ అంటున్నారు.


ఫస్టాఫ్ కామెడీగా, సెకండాఫ్‌ను మంచి యాక్షన్ ఎలిమింట్స్‌తో అన్ని ఎమోష‌న్స్‌తో తెర‌కెక్కే ఈ చిత్రం పై మ‌హేష్ ఫ్యాన్స్ ఆశ‌లు బాగానే పెట్టుకున్నారు.  మొత్తంగా ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి కమర్షియల్ మూవీ అవుతుందని, ఫ్యామిలీతో థియేటర్‌లో హాయిగా చూసే సినిమా అని టాక్. ఇక ఇదిలా ఉంటే గ‌తంలో అనిల్ రావిపూడి చిత్రాలు చూసుకుంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని బాగానే ఆకట్టుకుంటాడ‌నే చెప్పాలి. ఇటీవ‌లె విడుద‌లైన ఎఫ్‌2 చిత్రంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి  మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ఈ చిత్రం కూడా  అదే విధంగా హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నారు.


Leave a Reply

Your email address will not be published.