మోదీ బయోపిక్ .. ఇదీ కథ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా ‘పిఎం నరేంద్ర మోదీ’అనే టైటిల్ తో ఓ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను 23 భాషల్లో విడుదలచేశారు. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క షూటింగ్ నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రారంభమైంది. ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ చిత్రాల దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బోమన్ ఇరానీ ,దర్శన్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలకానుంది. ఇక ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలై మిక్సడ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మరి ఈ బయోపిక్ ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.