స‌రిలేరు నీకెవ్వ‌రులో ర‌ష్మిక ఫేమ‌స్ డైలాగ్ కాపీ కొట్టేశారా?


సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన‌`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్‌, సాంగ్స్ సోష‌ల్‌మీడియాలో అద్భుత‌మైన వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ప్ర‌తి సినిమాలో ఒకొక్క‌రికి ఒక్కో మ్యాన‌రిజ‌మ్ పెట్ట‌డం ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి స్పెషాలిటీ అని చెప్పాలి. ఒక్కో సినిమాలో ఒక్కో డైలాగ్ బాగా హైలెట్ అయ్యేలా వాళ్ళ మ్యాన‌రిజ‌మ్‌గా పెడుతుంటారు. అయితే ఈ ట్రైల‌ర్‌లో చూస్తే ర‌ష్మిక‌కి ఒక మ్యాన‌రిజ‌మ్ ఉంటుంది. అదేంటంటే… `నీకు అర్ధ‌మౌతోందా`?? అంటూ చిలిపిగా అంటుండ‌టం అప్పుడే ఫేమ‌స్ అయిపోయింది. నీకు అర్థమౌతోందా? అంటూ చేయి అడ్డంగా పెట్టి చెప్తున్న ఈ డైలాగ్ టిక్ టాక్ ఇతర యాప్‌లలో వైరల్ అవుతోంది. ఇంత పాపులర్ అవుతున్న ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందే అంటూ ఆలోచనలో ప‌డ్డారు కొంత మంది నెటిజ‌న్లు.

ఇలాంటి చిన్న చిన్న డైలాగులు  సినిమా ఆడియన్స్‌కి కొత్తేమో కాని.. టీవీ ప్రేక్షకులకు అందులోనూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటే.. ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ డైలాగ్స్ అన్నీ బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ టైటిల్ కొట్టిన సింగర్ గీతా మాధురివే అని కొంత మంది అంటున్నారు.


ట్రైల‌ర్ చూస్తే ర‌ష్మిక ఈ డైలాగ్‌ని చాలా క‌ష్టంగా ప‌ట్టిప‌ట్టి చెప్పిన‌ట్లు ఉంట‌ది. కానీ బిస్‌బాస్‌3 సీజ‌న్‌లో ర‌న్‌ర‌ప్‌గా మిగిలిపోయిన గీతామాధురి సెట్‌లో ఉప‌యోగించే ఊత‌ప‌దం అది. నేచ‌ర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేసిన ఈ బిగ్ బాస్ సీజ‌న్‌2 ఫైన‌ల్‌లో కౌశ‌ల్‌కి విన్న‌ర్ టైటిల్ వ‌చ్చింది. రష్మిక.. ‘నీకు అర్ధమౌతోందా’ అంటూ ఈ డైలాగ్ గీతా మాధురిదే అని అందరికీ అర్ధమయ్యేట్టు చెప్తోంది. ఇదిలా ఉంటే మ‌న నెటిజ‌న్లు కూడా మాములు వాళ్ళు కాదండోయ్ ఏదైనా చిన్న‌ది ఉందంటే ఇట్టే ప‌ట్టేస్తారు అంత పెద్ద తెలివిగ‌ల‌వాళ్ళు. ఏది ఏమైనా ఒక క్రేజీ హీరోయిన్ చెప్పే ఆ డైలాగ్‌కి కాస్త హైప్ ఎక్కువ‌గానే ఉంటుంది. పైగా త‌న క్యూట్ క్యూట్ లుక్స్ అండ్ ఎక్స్‌ప్రెష‌న్స్ దానికి మిక్స్ కావ‌డంతో ఆ డైలాగ్ మ‌రి కాస్త హైలెట్ అయింది.  అనిల్ త‌క్కువోడేమి కాదండోయ్‌. 

Leave a Reply

Your email address will not be published.