బాల‌య్య‌-బోయ‌పాటి సినిమా కాస్టింగ్ అద‌ర‌హో…


దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య ప్రస్తుతం తన 105 సినిమా రూర‌ల్‌ డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమా విడుదల కాగానే బోయపాటి శ్రీను తో కల‌సి కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు ఈ నంద‌మూరి న‌ట‌సింహం. సింహా, లెజెండ్  బ్లాక్‌బస్టర్స్ తర్వాత బాల‌య్య‌, బోయ‌పాటిల  కాంబినేష‌న్‌పై ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అభిమానుల‌తే బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్ ఖాయం చేసేసుకుంటున్నారు.
దీంతో అభిమానుల అంచనాలకు త‌గ్గ‌ట్టే  బోయపాటి ఈ సినిమా  కాస్టింగ్ విష‌యంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు స‌మాచారం. బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్ర రోజా కు ద‌క్కింద‌ని వార్త‌లు వినిపిస్తుంటే రంగస్థలంలో రంగమ్మత్తను మించిన క్యారెక్టర్ కోసం అనసూయ ను ర‌డీ చేస్తున్నాడ‌ట‌ బోయపాటి. రెగ్యులర్ కమెడియన్స్‌‌తో పాటు ఈ చిత్రంలో జబర్ధస్త్ షో  కమెడియన్స్‌కి స్థానం ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాత‌లున్న‌ట్టు యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.