తమతో మందు కొట్టాలన్న తండ్రి చివరి కోరికను తీర్చిన కొడుకులు
జీవిత చరమాంకంలో ఉన్న తన చివరి కోరిక తీర్చాలని కోరిన ఆ పెద్దాయన అనందంగా కళ్లు మూసిన ఘటనల అమెరికాలోని విస్కాన్సిన్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే గత కొంత కాలంగా 87 ఏళ్ల స్కెమ్ ప్రేగు క్యాన్సర్తో బాధ పడుతున్న నార్బెర్ట్ స్కేమ్ అనే వృద్ధుడు మంచం మీదే సకల సేవలూ చేయించుకుంటున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం కాస్త విషమించడంతో వైద్య చికిత్సలందించేందుకు వచ్చిన వారు అతడు ఇక బతకడని నేడో రోపో మరణించడం ఖాయమని తేల్చి చెప్పారు. ఈవిషయం కాస్త స్కేమ్ కు చేరడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొడుకులందరినీ పిలిపించుకుని తన ఆఖరి కోరిక వివరించి దానిని తీర్చాలని కోరాడు.
ఆ కోర్కె విన్న వారంతా ఆశ్చర్య పోవటం మాటటుంచి ఎగిరి గంతేసారు. ఇంతకీ ఆ పెద్దాయన కోరికేంటంటే… కొడుకులతో కలిసి ఒక బీరు తాగి కన్నుమూయాలనట… ఇంకేం ఎవరికి వారే తండ్రికోసమంటూ డజన్ల కొలది బీర్లు తీసుకొచ్చి తండ్రి ముందు ఉంచారు. అంతా కలసి బీర్లు తాగారు. కొడుకులతో కలిసి మందు కొట్టి ఆనందంగా వారితో మాట్లాడుతూ అక్కడే మంచంమీద ఒరిగి పోయాడు స్కేమ్.
ఈ విషయాన్నిస్కెమ్ మనవడు ఆడమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘మా తాత ఈ రోజు చనిపోయాడు. అతని ఆఖరి కోరికలో భాగంగా నిన్న రాత్రి తన కొడుకులతో కలిసి చివరి బీర్ తాగాడు’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన చనిపోవడానికి కొద్ది గంటల ముందు తన భార్య జాన్నె, ఆయన కొడుకులు బాబ్, టామ్, జాన్లతో కాసేపు మాట్లాడాడు. కలిసి ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేశాడు. తన తాత చివరి కోరిక తీర్చిన తన తండ్రికి పినతండ్రులకు కృతజ్ఞతలు చెప్పాడు.
—-