ఏపి అభివృద్ధికి కేంద్ర నిధుల వరద పారించాం : సోమువీర్రాజు
3 years ago
నాలుగున్నారేళ్లుగా రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని వే ల కోట్లు అభివృద్ధికి అందించిందో లెక్కతో తెల్చీ చెప్పకుంద్దాం….. ముఖ్యమంత్రి సిద్దంగా ఉంటే తన విసిరిన సవాలును స్వీకరించి ముఖా ముఖి నిర్వహించుకునేందుకు సన్నదం కావాలని భాజాపా జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు సవాల్ విసిరారు. కర్నూు జిల్లా ఎమ్మిగనూరులో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన విడియోకాన్ఫిరేన్స్కు ఆయన హాజరై విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏపిని విభజించి నాశనం చేసిన సోనియాతో జత కట్టి కాంగ్రెస్తో కాపురం చేయడం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రెండు ఏకరాలున్న చంద్రబాబు 2 లక్ష కోట్లకు ఎలా అధిపతి అయ్యారంటూ ప్రశ్నించారు. 7.60 క్ష ఇళ్లు అందిస్తే కేవం 1.50లక్ష ఇళ్లను నిర్మించి చేతులు దుపుకున్న చంద్రబాబు కాదా? అని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధు ఏపి కి ఇచ్చామన్నారు. ఎల్ఇడి బల్బుల నుండి తిరుపతి, విశాఖ, కాకినాడ పట్టణాను స్మార్ట్ సీటిగా రూపొందిస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు.లోకేష్ బాబును ముఖ్యమంత్రి గా చేసేందుకు చంద్రబాబు నాయుడు తహాతహాలాడుతూ నక్క అనందబాబులాంటి గుంట నక్కను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.. రైతుకు సోలార్, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ ను తొక్కేసి భాజాపా నాయకును గృహా నిర్భందం చేయడం, దాడులు చేయించడం, భాజాపా ముఖ్య నేతల ఇళ్ల పై రాళ్లు రువ్వించడం లాంటి నీచరాజకీయాలు చంద్రబాబుకే చెల్లిందన్నారు.