మహేశ్ సినిమాకు మరోమారు తమన్ సంగీతం..!

‘సరిలేరు నీకెవ్వరు జోరులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన తాజా సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి చేయాలని నిర్ణయించుకున్నాడు. మహేశ్, వంశీ కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈచిత్రంపై అంచనాలున్నాయి. మహేష్ కి ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాకు సంగీతం అందించిన తమన్‌ని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి అభిమానులకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా ఈ సినిమా వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.