త్రివిక్రమ్ , కృష్ణ సినిమా కాపీ కొట్టాడా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌,- స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సంక్రాంతికి వ‌చ్చిన   `అల‌..వైకుంఠ‌పురములో..`. ఈ ఏడాది  భారీ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిల‌చింది. అయితే ఈ చిత్ర క‌థ త‌న‌దేన‌ని, దానిని త్రివిక్ర‌మ్ క‌థ‌ను కాపీ కొట్టాడంటూ కృష్ణ అనే ద‌ర్శ‌కుడు ఫిలింఛాంమ‌ర్ మెట్లెక్కిన‌ట్టు స‌మాచారం. 
సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే…  కృష్ణ అనే ద‌ర్శ‌కుడు 2013లోనే త‌ను క‌థ‌ను రాసి ఫిలించాంబ‌ర్‌లో రిజిష్ట‌ర్ చేయించాడ‌ట‌. ద‌శ‌-దిశ పేరుతో సినిమా తీయాల‌నుకుంటున్నాన‌ని,  స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజీని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని, దాని ఆధారంగా   త్రివిక్ర‌మ్ `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా తీశాడ‌ని కృష్ణ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కి లీగ‌ల్ నోటీసులు కృష్ణ‌భావిస్తున్న‌ట్టు స‌మాచారం.  అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అల వైకుంఠ‌పురం  చిత్ర యూనిట్ స్పందించ‌లేదు. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.