కన్నడ చిత్రసీమలో తన పర్ఫార్మెన్సుతో మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరో నిఖిల్ కుమార్….

తెలుగు, కన్నడ భాషల్లో  రూపొందే ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంతో సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీ అయిన లహరి మ్యూజిక్ తొలిసారి సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతుండటం విశేషం. 
కాగా జనవరి 22 నిఖిల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర విశేషాల‌ను నిర్మాత  చంద్రు మనోహరన్  మీడియాకు తెలిపారు.  
అందమైన ప్రేమకథ,  యాక్షన్ మేళవించిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తయారవుతుందని చెప్పారు.టాప్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చ‌నున్నార‌ని,   హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల‌ ఎంపిక జరుగుతోందని,  అన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని, రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు సిద్దంచేసిన‌ట్టు చెప్పారు.  

Leave a Reply

Your email address will not be published.