కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్… హ‌రీష్‌కు ప్రాధాన్యం ఇస్తూనే… మ‌రోప‌క్క‌…?


 ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ మేనల్లుడు ప్రస్తుత తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. 2001 నుంచి తన మామ కేసీఆర్ వెంట నడుస్తూ వస్తున్న హరీష్ మొట్టమొదటిసారిగా 2004లో జరిగిన సిద్ధిపేట ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన విష‌యం తెలిసిందే.  అసెంబ్లీ లోకి అడుగుపెట్టి ఇకనుంచి ప్రతి సారి తన మెజార్టీ పెంచుకుంటూ వస్తున్నా.. హరీష్ గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా లక్షా 20 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక ఎవరెన్ని అనుకున్నా కేసీఆర్‌కు తన మేనల్లుడు హరీష్ రావు కు ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వంలో హరీష్ కి ఎంతో ఇష్టమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవిని కట్టబెట్టిన కేసీఆర్ రెండో ప్రభుత్వంలో తొలి ఆరు నెలల్లో హరీష్ కు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఏకంగా కీలకమైన ఆర్థిక శాఖను కట్టబెట్టారు. హరీష్ ప్రాధాన్యం కేసీఆర్ ఎప్పుడు తగ్గించలేదు. అయితే కేసీఆర్ హరీష్ విషయంలో ఎంత వరకు ప్రాధాన్యం ఉంచాలో అంతవరకు ఉంచుతూనే అటు వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌న్న‌ చర్చలు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.


 ఇందుకు కారణం నేడు రేపు టిఆర్ఎస్ భవిష్యత్ రథసారధి కేసీఆర్ తర్వాత ఎవరు అన్న ప్రశ్న పుట్టక మానదు. అప్పుడు తన కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని ముందస్తు ప్రణాళికతోనే కెసిఆర్ హరీష్ కు ప్రాధాన్యం ఇస్తూనే అటు తన కుమారుని పైకి లేపుతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది.


ఇక ఇదిలా ఉంటే…గ‌తంలో టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సీఎం కావాలని ఒక అభిమాని 1016 కొబ్బరికాయలు కొట్టడం కలకలం రేపింది. ఈ సంఘటన గులాబీ బాస్ కెసిఆర్ కు, అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గుబులు పుట్టిస్తోంది . మొన్నటికి మొన్న మంత్రి ఈటెల రాజేందర్ గులాబీ జెండా ఓనర్ల మంటూ, ఎవరి దయాదాక్షిణ్యాల మీద మంత్రిని కాలేదంటూ ధిక్కార స్వరం వినిపించగా, ఇక తాజాగా హరీష్ రావు కోసం టీఆర్ఎస్ నేత విష్ణు హరీష్ రావు సీఎం కావాలంటూ జోగులాంబ గుడి లో 1016 కొబ్బరికాయలు కొట్టడం క‌ల‌క‌లం రేపింది. 

Leave a Reply

Your email address will not be published.