రాజేష్ టచ్ రివర్ ‘పట్నఘడ్’ చిత్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు


 ప్రతిష్టాత్మకంగా జరిగిన LIFFT india filmotsav – world cine Fest, Lonavala  2019లో   ‘పట్నఘడ్ చిత్రం,  రెండు అవార్డులను సొంతం చేసుకుంది.  ఇస్మైల్ మర్చంట్ అవార్డు ఉత్తమ నిర్మాతగా శ్రీధర్ మార్తా, పద్మశ్రీ గ్రహీత  డా.. సునీతా క్రుష్ణన్, మనోజ్ మిశ్రా, అతుల్ కులకర్ణి, లను వరించగా , ఉత్తమ  నేపథ్య సంగీతానికి  గానూ సంగీత దర్శకుడు జార్జ్ జోసఫ్ ను మరో అవార్డు వరించింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రశంసలు పొందిన, జాతీయ అవార్డు గ్రహీత  రాజేష్ టచ్ రివర్ రూపొందించారు.

ఒడిషాలో జరిగిన యథార్థ గాధ ప్రేరణతో  ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిన ’పట్నఘడ్‘ మొదట్నుంచి ఒడిషా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతూనే వుంది. దానికి తోడూ కోర్టు కేసులు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచాయి. ఒడియా, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం ఒడిషాలో సెన్సార్ పూర్తిచేసుకుంది. ఆర్. పి. పట్నాయక్ రూపొందించిన ఫోక్ సాంగ్ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా  త్వరలో సెన్సార్ పూర్తి చేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం కోర్టులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా…. చివరికి న్యాయమే గెలిచింది అని  నిర్మాత శ్రీధర్ మార్తా తెలిపారు. లిప్ట్ ఇండియా ఫిల్మోత్సవ్ వరల్డ్ సినీ ఫెస్ట్ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘ ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా వుంది. రాజేష్ టచ్ రివర్ ఈ చిత్రం కథ చెప్పినప్పుడే నాకు చాలా ఆసక్తి కలిగించింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రం. కమర్షియల్ విలువలతో  ఆసక్తి రేపుతూ,  అవార్డులు కూడా సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది’ అన్నారు.. సంగీత దర్శకుడు జార్జ్ జోసఫ్ మాట్లాడుతూ ‘ నేపథ్య సంగీతం రూపొందిస్తున్నప్పుడే ఈ చిత్రం మంచి ప్రశంసలు పొందుతుంది అనిపించింది. ఈ అవార్డు రావడం ఆనందంగా వుంది ’ అన్నారు.

అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, సిజ్జు, అను చౌదరి, సంజు శివరామ్, యశ్ పాల్ శర్మ, పుష్పా పండా తదితరులు  నటించిన
 ఈ చిత్రానికి మాటలు: రవి. కే. పున్నం.ఎడిటింగ్: శశికుమార్, ఆర్ట్, రాజీవ్ నాయర్, స్పెషల్ మేకప్:  ఎన్. జి. రోషన్  ,(స్పెషల్ సాంగ్) సంగీతం:  ఆర్. పి. పట్నాయక్, నేపథ్య సంగీతం: జార్జ్ జోసఫ్,  కెమెరా: రామ తులసి, పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి,  నిర్మాతలు: శ్రీధర్ మార్తా,   పద్మశ్రీ గ్రహీత డా.. సునీతా క్రుష్ణన్, అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్రా,. కథ,, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్

Leave a Reply

Your email address will not be published.