గ్లామర్ పోజ్ లలో అదరకొడుతుందిగా…ఆర్ఎక్స్ 100 చిత్రంతో సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి యువతనంతా తనవైపు తిప్పేసుకున్న పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతోనే  కుర్రకారు మ‌దిని కొల్ల‌గొట్టేసింది. ఈ పంజాబీ భామ గ్లామర్ రోల్స్ తో పాటు న‌ట‌న‌కి స్కోపు ఉన్న పాత్ర‌లే అందుకుంటోంది. ఈ మ‌ధ్య వ‌చ్చిన  వెంకీమామ చిత్రంలో   పాయల్ రాజ్ పుత్ న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.  ఏమాత్రం బెదురులేకుండా అందాలు ఆరబోత‌కు పెట్టింది పేరుగా నిలుస్తున్న ఈ అమ్మ‌డు ఐటెం సాంగ్స్ కూడా చేసేందుకు సిద్ద‌మ‌వుతోంది. గ‌త ఏడాది వ‌చ్చిన‌ సీత చిత్రంలో బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసి, చిత్ర జ‌య ప‌రాజ‌యాల‌తో నిమిత్తం లేకుండా దూసుకు పోతూ అవ‌కాశం వ‌స్తే మ‌రిన్ని ఐట‌మ్‌లు చేసేందుకు సిద్ద‌మేనంటోంది.  పాయల్ రాజ్ పుత్  సోషల్ మీడియాలో నూ యాక్టీవ్ గా ఉంటూ ఇందుకోసం ప్ర‌త్యేకంగా  ఫోటో షూట్స్ చేస్తూ,  గ్లామర్ ఫోజుల్లో  అద‌ర‌గొడుతోంది. తాజాగా పాయల్  త‌న సామాజిక మీడియా ఖాతాలో ప‌లు ఫోజుల ఫోటోలు షేర్ చేసి అభిమాన గ‌ణాన్ని పెంచుకునే ప‌నిలో ప‌డింద‌నిపిస్తోంది.  
 

Leave a Reply

Your email address will not be published.