కొత్తగా టాటూ తో పవన్ కళ్యాణ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ  ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి పవన్ ఎంతో ఇష్టంగా తన పద్ధతులు, డ్రెసింగ్ స్టైల్ మారుస్తుంటారు ఇప్పుడు  పవన్ కొత్తగా టాటూ మొజులో పడినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటు వచ్చారు. 

 రీఎంట్రీలో అభిమానులు పండుగ చేసుకునేలా ఒకేసారి  మూడు సినిమాలను ప్రకటించి అబ్బురపరిచాడు. పింక్ రీమేక్ , క్రిష్ సినిమాలకు పచ్చజెండా ఊపారు. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు.
 గబ్బర్ సింగ్ తర్వాత అదే రేంజ్‌లో పవన్‌ను మెప్పించేందుకు మంచి దమ్మున్న కథను పవన్ సినిమాకు ఎంచుకున్నారని సమాచారం.  ఈచిత్రాన్ని సైతం ఇదే నెలలో సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు  రెడీ అవుతున్నారు. 

తాజాగా జనసేన కార్యకర్తలతో ప్రత్యేకంగా పవన్ సమావేశమయ్యారు. ఇందులో క్లీన్ షేవ్‌తో కనిపించిన పవన్ కుడిచేతికి ఆసక్తికరమైన ఓ టాటూ కనిపిస్తోంది. ఇంతకు ముందు ఆ టాటూ పవన్ చేతిపై కనిపించలేదు. కానీ ఈ మధ్యే కనిపిస్తోంది.  ఈటాటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుడడంతో అభిమానులు దీనిపై చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.