నో కండీష‌న్స్ అంటున్న -న‌భా

యంగ్ బ్యూటీ  న‌భా న‌టేష్ న‌న్ను దోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది.  తాజాగా ఈ యంగ్ బ్యూటీ వరుస పెట్టి ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కాగా తన లేటెస్ట్ స్టిల్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన గ్లామర్ తోనూ నభా నేటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
దీనికి తోడూ నటన పరంగానూ నభాలో మంచి ప్రతిభ ఉంది. పైగా ఇతర హీరోయిన్స్ లా దర్శక నిర్మాతలకు ఎలాంటి డిమాండ్స్ కానీ, కండిషన్స్ కానీ పెద్దగా పెట్టదని పేరు కూడా ఉంది. దీనితో నభా నటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ ప్రేక్ష‌కులు.
కాగా తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మాట్ శంకర్’లో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published.