ఇక వాట్సాప్‌లోనూ ప్ర‌క‌ట‌న‌ల ప‌రంప‌ర‌

 ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు అనేది ఎంత నిజమో…వాట్సాప్ లేని స్మార్టు ఫోన్ లేదు అన్నది కూడా అంతే నిజం. ఈ వాట్సాప్ ద్వారా మనుషులు డైరెక్టుగా కలవకపోయిన అన్ని పనులు జరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే మెస్సేజింగ్‌ యాప్‌ కేవలం చాటింగ్‌ మాత్రమే కాక ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్స్‌తో ఎంతో మందికి చేరువ కావ‌టంతో ఇంత ప్ర‌త్యేకత సంత‌రించుకుంది. ఈ క్రమంలో దీని వాడకం మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్‌లో బోలెడన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. 

దాంతో ఈ వాట్సాప్ ఉపయోగించేవారి సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఫీచర్ వాట్సాప్‌లోకి రానుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లో కనిపించినట్టుగానే ఇప్పుడు వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయని సంస్థ పేర్కొంది. ఇట్టి విషయాన్ని ఇటీవలే నెదర్లాండ్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సమ్మిట్‌లో వెల్లడించింది. కాకపోతే ఈ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుందనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. గత కొద్ది రోజుల నుంచి ఈ వార్త ఫుల్‌గా ట్రోల్ అవుతోంది. 

కాగా.. వాట్సాప్‌లో యాడ్స్ ఎలా వస్తాయని మీరు ఆలోచించవచ్చు. సఫోజ్ స్టేటస్‌లు చూస్తున్నప్పుడు, లేదా కాల్స్ చేసేటప్పుడు కానీ ఈ యాడ్స్ రావచ్చు.  వాట్సాప్‌లో యాడ్స్ వస్తున్నాయని సంస్థ చెప్పడంతో.. నెటిజన్లు కాస్త చిరాకును వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అవి విధులకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని యాడ్స్ అయితే.. దానికి ఇచ్చిన సమయం పూర్తి అయ్యేంతవరకూ అది క్లోజ్ అవదు. ఇలాంటివి మనం యూట్యూబ్స్‌లో, సోషల్ మీడియా యాప్స్‌లో చూస్తూనే ఉన్నాం.

Leave a Reply

Your email address will not be published.