‘ఐఎస్‌ఐ’ ఆనవాళ్లుతోఉలిక్కి పడిన ఉత్తరాంధ్ర

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో ఐఎస్‌ఐ ఆనవాళ్లు కనిపించడంతో అక్కడి పోలీసు అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తాజాగా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అందడంతో, అతన్ని అదుపులోకి తీసుకొని ఎన్‌ఐఏకి సమాచారం అందించారు. అలాగే చిలకపాలెం టోల్‌ గేట్ వద్ద ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేపట్టారు. దక్షిణ భారతదేశంలో భారీ దాడులకు కుట్ర పన్నేందుకే పాకిస్తాన్ ఐఎస్‌‌ఐ ఏజెంట్‌ను ఇండియాకు తరలించిందా? లేక, రాష్ట్ర కేంద్రంగా పాకిస్తాన్ దాడులకు ప్లాన్ చేస్తోందా? అనే అనుమానాలు ఆ ఘటన ద్వారా ప్రశ్నార్థకంగా మారాయి. పోయిన ఏడాది జరిగిన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత, దేశంలో ఉగ్రదాడులకు పాక్ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. 

Leave a Reply

Your email address will not be published.