ప‌వ‌న్ రీఎంట్రీ దొంగ‌గానా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అభిమానుల కోరిక మేరకు అయన మళ్ళీ మేకప్ వేసుకోనున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ  రీఎంట్రీ త్వరలో ఉంటుందని గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తున్న విష‌యం తెలిసిందే..
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా ‘పింక్’ రీమేక్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అయితే పవన్ మాత్రం ఇంకా ఈ విషయం పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓప‌క్క ఈ విష‌యం పై ఇంకా ప‌క్కా క్లారిటీ లేక చూస్తుంటే… మ‌రోప‌క్క  పవన్ ఇంకో సినిమాకు సైన్ చేశారనే వార్తలు జోరందుకున్నాయి.


పవన్ త‌ర్వాత‌ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్‌లో చేస్తారని, ఇందులో పవన్ ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడని రకరకాల వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం చేయనున్నారనే వార్త పుట్టుకొచ్చింది. ఇవన్నీ వింటున్న ఫ్యాన్స్ మాత్రం రీ ఎంట్రీ ఇవ్వబోయే మొదటి సినిమా గురించే పవన్ ఇంకా మాట్లాడలేదు.. అప్పుడే రెండో సినిమా గురించి వార్తలు మొదలయ్యాయని, వీటిని నమ్మాలో లేదో అర్థం కావట్లేదని అంటున్నారు. అయితే అయన మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. అయితే పవన్ ప్రస్తుతం రెండు చిత్రాలతో కనువిందు చేయనున్నారు . ఏ ఎమ్ రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు . దిల్ రాజు ఈ  సినిమాలో లాయర్ గా… క్రిష్ దర్శకత్వంలో పవన్ దొంగగా నటించనున్నాడట. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నార‌ని స‌మాచారం.


Leave a Reply

Your email address will not be published.