టిడిపి స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌

స్పీకర్ పోడియం ను ముట్టడించి మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దంటూ నినాదాలు చేసిన‌ ఏడుగురు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. సోమ‌వారం అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాల‌లో  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏడుగురు తెలుగుదేశం స‌భ్యులు స‌భా వ్య‌వ‌హారాల‌కు అడ్డుత‌గులుతున్నందున వారిని స‌భ‌నుంచి బైట‌కు పంపాల‌ని ప్ర‌తిపాదించారు.  దీంతో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్, గద్దె రామ్మెహన్ రావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి, పయ్యావుల కేశవ్, రామకృష్ణ ప్రసాద్, బాల వీరంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్ లను మార్షల్స్ బయటకు తీసుకువెళ్లారు.

Leave a Reply

Your email address will not be published.