జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఉచ్చు బిగించనుందా…

అందరూ అనుకున్నట్టుగా తమిళనాడులో శశికళకు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ లో  జగన్ కు జరగవచ్చు అనే దానిలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రచారం మాత్రం బాగా జరిగింది..ఈ విషయం వెలుగులోకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా  ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో ఈ అనుమానం మరింత బలపడింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మళ్లీ తిరగ తోడి రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం చాలా దుందుడుకుగా ప్రవర్తించింది..   పోలవరం ప్రాజెక్టు , పీపీఏల విషయంలో  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  ప్రమేయం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిర్ణయాలు  తీసుకుందని చెప్పినా  జగన్ వినలేదు. ఈ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకుంది . అయినా జగన్ పట్టించుకోలేదు. జగన్  ప్రభుత్వం ఒంటెద్దు పోకడకు కేంద్రం బ్రేక్ వేయాలని నిర్ణయించుకుంది. అందుకనే సెంట్రల్ హోం మినిస్టర్ జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందులోనూ అమరావతి రాజధానికి  మోడీ చేతులమీదుగా శంకుస్థాపన చేయిస్తే దానిని కూడా జగన్ ఇప్పుడు విశాఖకు తరలిస్తున్నట్లు ప్రకటించారు..దీనిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు .అంతేకాదు మోడీ శంకుస్థాపన చేసిన చోటనే  మూడు గంటల పాటు మౌన దీక్ష కూడా చేపట్టారు . ఈ నేపథ్యంలో ఇవన్నీ జగన్ మెడకు ఉచ్చులా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..ఏమవుతుందో చూద్దాం

Leave a Reply

Your email address will not be published.