భర్తను చంపి ప్రియుడితో అక్రమసంబంధం

కట్టుకున్న భర్త ను కైలాసానికి పంపేసి తన అక్రమ సంబంధాలను కొనసాగించాలనుకుని అడ్డంగా బుక్ అయ్యి… ఇప్పుడు ప్రియులతో పాటు జైలు ఊచలు లెక్కిస్తున్న ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.
ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే …తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని మట్టలూరు గ్రామంలో పొన్నువేల్ (46) ప్రియ (41) భార్యాభర్తలు, వీరికి ఒ కొడుకు కూతురు కూడా ఉన్నారు. పొన్నువేల్ వ్యవసాయం చేయిండగా ప్రియ మంగళం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది.
అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆమె కామంతో పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు గ్రామంలోని అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యవహారం పొన్నువేల్ దృష్టికి రావటంతో ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో పాటు ఉద్యోగం మానేయమని సూచించాడు.
దీంతో తన సుఖాలకు అడ్డువస్తున్న భర్తను అంతం చేస్తే పీడపోతుందని భావించిన భార్య ఆతన్ని చంపడానికి మూడుసార్లు ప్రయత్నించింది. ఓ పర్యాయం అన్నంలోనూ, మరోమారు బిరియానీలోనూ విషం కలిపి ప్రేమగా తినిపించింది. అయితే పొన్నువేల్ ఆ ప్రభావంతో వాంతులు విరోచనాల బారిన పడి ఆసుప్రతిలో చేరి ఎలాగోలా బైట పడ్డాడు. అయితే భర్తను కాటికి సాగనంపడంతోనే తనకు ఆస్తి, శారీరక సుఖం లభిస్తుందని భావించిన ప్రియ తన కామకేళిలో పాలు పంచుకుంటున్న శక్తివేల్ (23), అరుణ్ కుమార్ (24) అనే ఇద్దరు యువకులకు తన ప్లాన్ వివరించింది.
నా భర్తను చంపేస్తే, అవసరమైన డబ్బులూ ఇస్తానని, ఇద్దరితో కలిసి తాను సంతోషంగా జీవించడానికి తనకు అభ్యంతరం లేదంటూ చెప్పడంతో వారు అంగీకరించారు. దీంతో ఈ మధ్య పొన్నువేల్ బైక్ లో పెరియపట్టణకు వెలుతున్న విషయాన్ని ప్రియులకు సమాచారం అందించిన టీచర్ ప్రియ వారితో కలసి కారులో వెంబడించింది. నిర్మాణుష్య ప్రదేశంలో అతని బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టి హత్య చెయ్యడానికి యత్నించింది.
పొన్నువేల్ వాహనాన్ని బలంగా కారు ఢీకొనటంతో ఆయన ఎగిరి పక్కనున్న పొదల్లో పడటం, ఎలాంటి శబ్ధం లేక పోవటంతో చనిపోయాడని భావించిన ప్రియ యథాలాపంగా ఇంటికి వచ్చేసింది. అయితే పొదల్లోంచి వచ్చిన మూలుగులు విని ఆ దారిన వెళ్తున్న కొందరు పొన్నువేల్ని సమీప ఆసుప్రతిలో తరలించి పోలీసులకు తెలిపారు.
దీంతో చికిత్స పొందుతున్న పొన్నువేల్ తనని హత్య చేయటానికి ప్రయత్నించింది తన పెళ్లాం అంటూ తన ప్రియులతో కలసి కారు ఢీకొనడంతో తో సహా విష ప్రయోగం వివరాలు కూడా చెప్పుకొచ్చాడు. తన భార్య తనని చంపేస్తుంది కాపాడండి! అంటూ ఫిర్యాదు చేసాడు.
ఈ ఫిర్యాదు అందుకున్న కారిమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తే టీచర్ ప్రియ ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ తో కలిసి కారుతో ఢీకొట్టించిన మాట వాస్తవమేనని తేలింది. దీంతో ప్రియ, ఆమె ఇద్దరు ప్రియులు శక్తివేల్, అరుణ్ కుమార్ ను అరెస్టు చేసి జ్యుడీషియరీ కస్టడికి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేస్తున్నామని త్వరలోనే అన్ని వివరాలు మీడియా ముందుకు తీసుకువస్తామంటున్నారు కారిమంగళం పోలీసులు.