గోడ మీద వార్తలు

                                                                20 – 02 – 2020
01 . హైదరాబాదులో తప్పుడు దృవపత్రాలతో ఆధారు పొందిన పలువురికి నోటీసులు పంపిన – UIDAI …
ఒరిజినల్లు సరిగా చెక్ చేయకుండా కార్డులిష్యూ చేసిన ఉద్యోగులకేం లేవా మరి … ??
02. తెలంగాణలో అనుమతుల్లేకుండా చెట్లు నరికితే ఐదు వేల నుండి ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తాం – టీ. మంత్రి యర్రబెల్లి …
అస్మదీయులకి ఐదువేలు – తస్మదీయులకి ఐదు లక్షలూ అని శ్రీవారి శ్లేష అయుండొచ్చు …!!
03. జైలులో తన తల గోడకేసి బాదుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నిర్భయ నిందితుడు …
ఈడ్నొదిలేసి ఈడికిట్టాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చినోళ్ళకి ఉరేసేస్తే దేశానికీ పట్టిన పావొంతు శనొదిలిపోద్ది – ఇంకోసారి వెధవలకి వకాల్తా పుచ్చుకోరు …!!
04. ప్రోమో లో చూపించిన సీను సినీమాలో లేదంటూ కన్సూమర్ కోర్టుకెక్కిన ప్రేక్షకుడు –  పదివేలు చెల్లించాలని నిర్మాతని ఆదేశించిన కోర్టు …
అంటే – ఇక మీదట బెల్లం ముక్క చూపెట్టి నేల నాకించేయటం కుదరదన్న మాట – పాపం ప్రొడ్యూసరు …!!
05. హైదరబాదులో ట్రాఫిక్ చలాన్లు తప్పించు కునేందుకు నంబరు బోర్డుకి ఆకులు అతికించిన –  పౌరుడు …
కియారా అద్వానీ ఆకుల కాన్సెప్టుకి మనోడే ఇన్స్పిరేషనై ఉంటాడు – యాడికెళ్ళొస్తాయిరా సామీ అవుడియాలు .. !!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.