గోపీచంద్ , తమన్నా లు జోడీగా

‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న తాజా చిత్రం లో యాక్షన్ హీరో గోపీచంద్ , తమన్నా లు జోడీగా నటిస్తున్న సంగతి విదితమే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం క్రీడానేపథ్యంలో జరుగుతోంది. గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఆరంభమయ్యాయి. కాగా ఈ సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మేరకు చిత్ర పోస్టర్ని విడదుల చేసింది.
గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద ఫ్లప్ కావటంతో ఈ చిత్రం హిట్ చేసి తీరాలని సంపత్ నంది బాగా శమపడుతున్నట్టే కనిపిస్తోంది.