జర్నలిస్టులకు ప్రభుత్వ పెన్షన్ పథకం

సమాజాభివృద్ధికోసం ప్రజలకు ప్రభుతానికి వారధిగా ఉంటూ  60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు ప్రభుత్వ పెన్షన్ పథకం వ‌ర్తింప‌జేయ‌డానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని ఏపీ ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్ దేవిరెడ్డి శ్రీ‌నాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ నెర‌వేర్చ‌డమే త‌న‌ మొద‌టి అజెండాగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. 60 ఏళ్లు నిండిన జ‌ర్న‌లిస్టుల‌కు పెన్ష‌న్ వ‌ర్తింప‌జేయాల‌న్న డిమాండ్ల‌తోకూడిన విన‌తి ప‌త్రాన్ని ఏపీ జాప్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ప్రెస్ అకాడ‌మీ చైర్మ‌న్‌ను క‌లిసి అందించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ తాను 35 ఏళ్లు జ‌ర్న‌లిస్టుగా ఉన్నాను కాబ‌ట్టి…ఆ ఇబ్బందులేమిటో త‌న‌కు బాగా తెలుస‌ని చెప్పారు. జాప్ రాష్ట్ర అధ్య‌క్షులు హెచ్‌. ఆజాద్‌, అనంత‌పురం జిల్లా అధ్య‌క్షులు స‌న‌ప రామ‌కృష్ణ‌, కార్య‌వ‌ర్గ‌స‌భ్యులు న‌రసింహులు నాయ‌క్‌లు చైర్మ‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. 
దేశంలో తమిళనాడు రాష్ట్రం జ‌ర్న‌లిస్టుల‌కు పెన్ష‌న్‌ను 1986లో 6 వేలు, 2013 నుండి 7,500/- రూపాయలకు పెంచింద‌ని, పాండిచ్చేరి రాష్ట్రంలో 2013 సం॥లో6 000/-, బీహారు రాష్ట్రంలో 6,000/- పంజాబ్‌ రాష్ట్రంలో 12,000/-, హర్యానా రాష్ట్రంలో 10,000/- మ‌ణిపాల్ (సిక్కిం) రాష్ట్రంలో 10,000/-, అస్సాం రాష్ట్రంలో 8,000/- అదేవిధంగా ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం వర్తింపజేస్తూ రిటైర్డ్ జర్నలిస్టులను అందుకుంటున్నవిష‌యాన్ని చైర్మ‌న్ దృష్టికి తె ప‌లువురు జ‌ర్న‌లిస్టులు తీసుకువ‌చ్చారు.

Leave a Reply

Your email address will not be published.