యువకుడిపై సామూహిక లైంగిక దాడి…

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన చోటుచేసుకుందని.. ఒక 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు కదులుతున్న కారులో మూడు గంటల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.  సెంట్రల్‌ ముంబై శివార్లలో నివసించే 22 ఏళ్ల యువకుడు ఆదివారం నగరంలోని ఓ రెస్టారెంట్‌ వద్ద సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ పోస్ట్‌ చూసిన నలుగురు అనుమానితులు బాధితుడి లొకేషన్‌ను ట్రేస్‌ చేసి తాము అతని ఫ్యాన్స్‌ అంటూ నమ్మబలికారు. తమతో పాటు బైక్‌ రైడ్‌కు రావాలని కోరగా బాధితుడు సమ్మతించి వారితో పాటు వెళ్లాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హాటల్‌ దగ్గర ఆగిన వారు అక్కడి నుంచి కారులోకి బాధితుడిని బలవంతంగా ఎక్కించుకుని మూడు గంటల పాటు నగరంలో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు సోమవారం తెల్లవారుజామున బాధితుడిని రోడ్డుపై పడవేసి పారిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై అసహజ లైంగిక చర్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published.