బంగారంపై కేంద్రం కొత్త రూల్స్..!
ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పని సరిగా ఉండాలంటూ కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని కోసం 2020 జనవరి 15న ప్రకటన విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంది. నిబంధన అమలు కోసం సంవత్సరం గడువు ఇస్తామని అప్పటిలోగా తమ వద్ద ఉన్న నిల్వల విక్రయాలను పూర్తి చేసుకోవాలని వ్యాపారులకు కేంద్రం సూచించింది. అంటే బంగారం వ్యాపారులు 2021 జనవరి 15 లోపు తమ దగ్గర హాల్ మార్క్ లేని నగలను ఉన్న అమ్మేసుకోవాల్సి ఉంటుందన్న మాట.