ద‌ర్శ‌క‌ర‌త్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే.డా.దాస‌రినారాయ‌ణ‌రావు విగ్ర‌హాన్ని ఆయ‌న స్వ‌స్థ‌లం పాల‌కొల్లులో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు, రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళిమోహ‌న్‌, న‌టుడు నిర్మాత మంచు మోహ‌న్‌బాబు పాల్గొన్నారు. పాల‌కొల్లులోని దాస‌రి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేశారు. దాదాపు 150 సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా, 300పైగా చిత్రాల‌కు ర‌క‌ర‌కాల విభాగాల్లో అనుబంధం ఉన్న వాడిగా, 53 చిత్రాల నిర్మాత‌గా దాస‌రి చ‌రిత్ర ఎంతో గొప్ప‌ది. ఆయ‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక సామాన్యుడు అసామాన్యంగా ఎదిగిన చరిత్ర‌కు అత‌డు సాక్ష్యం. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా నిరూపించుకున్నారు. 4 మే 1942లో పాల‌కొల్లులో జ‌న్మించారు. 30 మే 2017 (వ‌య‌సు 75)లో నిర్మాణం చెందారు. ఆయ‌న శిష్య వ‌ర్గాల్లో ఎంద‌రో ప్ర‌ముఖులు ఉన్నారు. ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో క‌థానాయ‌కుల్ని ప‌రిచ‌యం చేశారు. ఎంద‌రో ఆర్టిస్టుల‌కు లైఫ్‌ని ఇచ్చారు. అందుకే ఆయ‌న విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు. దాస‌రి బ‌యోపిక్ గురించిన చేయ‌క‌పోవ‌డం ఇటీవ‌ల విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.