బాహుబ‌లి నే గ‌డ‌గ‌డ గడగడ లాడించిన కరోనాక‌డవ‌డంత గుమ్మ‌డి కాయ అయినా క‌త్తిపీట‌కు లోకువే… అవును మ‌రీ…  ప్ర‌పంచాన్ని ఒకే ఒక సినిమాతో త‌న వైపుకు తిప్పుకున్న బాహుబ‌లి అయినా  చైనా నుంచి విశ్వ వ్యాప్తం అవుతున్న‌ కరోనా వైరస్ కు గ‌డ‌గ‌డ లాడాల్సిందే అనిపించింది. ఎయిర్ పోర్టులో ప్ర‌భాస్‌ని చూస్తే…. కరోనా వైరస్ పై ముందస్తుగా జాగ్రత్తగా డార్లింగ్ ప్రభాస్ మాస్క్ వేసుకొని బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మాస్క్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.  ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఫూజా హెగ్డే తో జ‌రిగిన షూటింగ్‌కి కూడా ప్ర‌భాస్ మాస్కుల‌తోనే హాజ‌ర‌వుతున్నాడ‌ట‌. 
 
కాగా ప్రపంచాన్ని వణికిస్తు కరోనా ఇప్పుడు 60కిపైగా దేశాల్లో విస్తరించింది.   తాజాగా ఇండియాలోనూ కేసులు న‌మోదు పెరుగుతుండ‌టంతో పాటు తెలుగురాష్ట్రాల‌లోనూ ఈ వ్యాధిగ్ర‌స్తుల‌ను క‌నుకోవ‌టం తో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది. దేశంలో ఇప్ప‌టికి 18 కరోనా కేసులను గుర్తించిన‌ట్టు అధికారిక స‌మాచారం.  

Leave a Reply

Your email address will not be published.