ప‌వ‌న్ గ్యాప్ త‌ర్వాత రెమ్యూన‌రేషన్ అద‌రగొడుతున్నాడుగా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  ఈ మ‌ధ్య రాజ‌కియాల‌తో కాస్త బిజీ అయి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తిరిగి ఆయ‌న మ‌ళ్ళీ సినిమాలు చేయ‌బోతున్నారు. బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్  సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని స‌మాచారం. ఆల్రెడీ గ్రౌండ్‌వ‌ర్క్ మొద‌లు పెట్టేశారు.  హీరో లేకుండా దాదాపు 40 రోజుల వర్క్ ఉంది. అందుకే ముందుగా జనవరి 20 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కాగా, ఫిబ్రవరిలో పవన్ 10 రోజులు కాల్ షీట్లు ఇచ్చారు. ఆ 10 రోజులు మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొననున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ మేరకు ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు.

మ‌రో ద‌ర్శ‌కుడు క్రిష్‌తో సినిమాకి కూడా ప‌వ‌న్ ఓకే చెప్పారు. ఆ సినిమాను కూడా పింక్ తో పాటు సమాంతరంగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఆయ‌న ఒకేసారి రెండు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి పండ‌గ మాములుగా ఉండ‌దు. ఇక ప‌వ‌న్ ఈ రెండు సినిమాల‌కు షెడ్యూల్ చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకున్నారు. ప‌ది రోజులు దిల్‌రాజు సినిమాకి ఇస్తే మ‌రో ప‌ది రోజులు క్రిష్ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ టెన్ష‌న్‌లో రాజ‌కీయాల‌కు కొంత గ్యాప్ ఇస్తారు.

అయితే ఈ సినిమాల‌కు గాను ప‌వ‌న్ దిల్ రాజు ద‌గ్గ‌ర‌ 50 కోట్ల రెమ్యునరేషన్, లాభాల్లో కొంత శాతం వాటా తీసుకోబోతున్నారు. అది ఎంత అన్నది మాత్రం వారిద్దరికే తెలుసు. అయితే క్రిష్-ఎఎమ్ రత్నం సినిమాకు మాత్రం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నారు.


Leave a Reply

Your email address will not be published.