రాష్ట్రంలో రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ఏకంగా 11 జిల్లాల్లో దాడులు రూ,12.40 లక్షలు స్వాధీనం పలువురిపై కేసులు నమోదు
అవినీతి  అక్రమాలకు నిలయమైనా ప్రధాన రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెంచి శుక్రవారం రాష్ట్రంలోని 11 జిల్లాలపై పంజా విసిరింది సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాతో పాటు అనంతపురం చిత్తూరు ప్రకాశం గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సంబంధిత జిల్లాల ఏసీబీ అదనపు ఎస్పీల నేతృత్వంలో డి.ఎస్.పి, సిఐ,లు తమ సిబ్బందితో కలసి ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేపట్టారు ఈ దాడులలో సుమారు 12 .40 లక్షల పైచిలుకు నగదు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కడప జిల్లా రాయచోటి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 80,000 చిత్తూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 86,000 అనంతపురం రూరల్ జిల్లా లో 2.15 లక్షలు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 83.660 రూపాయలు గుంటూరు జిల్లా తెనాలి సబ్ రిజిస్ట్రార్  కార్యాలయంలో 16,220 నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 40,000 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లక్షా 29వేల 640 రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 84000 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రకాశం జిల్లా సింగరాయకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడుల లో లభించిన నగదు వివరాలు తెలియాల్సి ఉంది మొత్తం మీద ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహణ పది జిల్లాల పై జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబుళ్లు  చేస్తున్నాయి ఏసీబీ రేపటి ఏ అవినీతి కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తారో వేచి చూద్దాం

Leave a Reply

Your email address will not be published.