గోడ మీద వార్తలు

                                             18 – 02 – 2020
01 . రెండువేల రూపాయల నోటుని రద్దు చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేసిన – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ …
చేసినా పెద్దగా ఏడ్చేటోడెవడూ లేడు లెండి – మాయ్య దెబ్బకి చిక్కంలో చిల్లర తప్ప పెద్ద నోట్లెవడూ మెయింటేన్ చేయటం లేదు …!!
02. విశాఖలో ప్రస్తుత తెదేపా నేత గంటా సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకున్న 300 మంది భాజపా కార్యకర్తలు …
వార్నీ – అంతమంది కార్యకర్తలున్నారన్న సంగతి ఇప్పటి వరకూ ఆళ్ళక్కూడా తెలీదేమో …!!
03. కరోనా అనేది వైరస్ కాదు – జంతువులని తినే వారిని శిక్షించడానికి అవతరించిన దైవం – అఖిల భారత హిందూ మహసభ నేత …
ఇహనేం – ఎగేసుకెళ్ళి తీసుకొచ్చి సెంటర్లో ఆశ్రమం కట్టి చుట్టూ చిజతలు కొడుతూ తిరగండి – సఖం జనాభా ఖాళీ అవుద్ది – శనొదిలిపోద్ది …!!
04. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన – పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం …
ఇంకానయం – చుట్టూ ముళ్ళ కంచేసి పైన మూతేయలేదు …!!
05. వికారాబాద్ లో తానే డ్రైవర్ కండక్టర్ అంటూ ప్రయాణీకులతో సహా బస్సెత్తుకెళ్ళిన – ఓ తాగుబోతు …
ఈ రోజుల్లో జీతం తీస్కోకుండా డ్యూటీ చేసే పనిమంతులు దొరకటం అదృష్టమనే చెప్పాల …!! 
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.