సినీ అవార్డ్స్ జీ తెలుగు…..నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు… జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 తో పేరుతో సినీ న‌టుల‌కు సాంకేతిక నిపుణుల‌కు 
అవార్డులు అంద‌చేసింది. ఉత్త‌మ న‌టుడుగా సైరా సినిమా తో వెండితెర మీద సంచ‌ల‌నం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అవార్డు అందుకోగా, స‌మంతా 
ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకున్నారు. అలాగే రామ్‌, పూరీ జ‌గ‌న్నాధ్ ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ ఉత్త‌మ చిత్రంగా అవార్డు 
అందుకోవ‌టం విశేషం. హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో కన్నుల పండుగగా జ‌రిగిన జీ తెలుగు రెండవ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 అవార్డుల కార్యక్రమంలో సినీతారల డ్యాన్సులు, ఆటపాటలు మరియు అదిరిపోయే పర్‌ఫార్మెన్స్‌లు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.


టాలీవుడ్‌ ప్రముఖ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, సమంత అక్కినేని , పూజ హెగ్డే , జయప్రద, ఖుష్బూ, భూమిక , సుష్మిత కొణిదెల ,కార్తికేయ, నిధి అగర్వాల్, సిద్ శ్రీరామ్, సింగర్ చిన్మయి , ఛార్మి కౌర్ , పూరి జగన్నాధ్ , రామ్ పోతినేని, రెజీనా కాసాండ్రా, మెహ్రీన్ పిర్జాదా, జీవిత రాజశేఖర్ , శివాత్మిక రాజశేఖర్ , ఆనంద్ దేవరకొండ తదితర సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్య‌క్ర‌మంలో తన గాత్రంతో సిద్ శ్రీరామ్ మైమరిపించారు. ఒక అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రదీప్ మాచిరాజు, యాంకర్‌ శ్యామల మరియు యాంకర్‌ రవి. వీరి కామెడీ టైమింగ్‌తో అవార్డుల కార్యక్రమంలో నవ్వులు పువ్వులు విరిశాయి. 

అంగరంగ వైభవంగా… కన్నుల పండుగగా జరిగిన ఈ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 వేదికపై టాలీవుడ్ తారాగణం అంతా కలిసి గత సంవత్సర సినిమా వైభవాన్నిగుర్తు చేసుకుంటూ అవార్డుల విజేతల మీద ప్రశంసల జల్లు కురిపించారు. మెహ్రీన్, రెజీనా వాళ్ళ వాళ్ళ పర్‌ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేసారు. చిరంజీవి పాట‌ల‌కు హీరో కార్తికేయ చేసిన పర్‌ఫార్మెన్స్‌ కార్యక్రమానికే హైలెట్‌ గా నిలిచింది. అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌లు, ఆకట్టుకునే డ్యాన్సులు, కామెడీ పంచ్‌లు, స్టార్‌ హీరోయిన్స్‌ స్టెప్పులతో ఆద్యంతం అద‌ర‌హో అనేలా సాగింది.

Leave a Reply

Your email address will not be published.