వంశి పైడిపల్లి తో మరోసారి జతకడుతున్నా ప్రిన్స్….

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన సినిమా ‘మహర్షి’ ఈ సినిమా పై వివాదాలెన్ని వచ్చినా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.. ఈ చిత్ర డైరెక్టర్ వంశీ పైడిపల్లి.తో మరోమారు జతకడుతున్నాడు ప్రిన్స్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ ఎంపిక చేసారు.
ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, గ్యాంగ్ స్టర్‌గా, ప్రొఫెసర్‌గా రెండు విభిన్న పాత్రలలో మహేష్ కనిపించనున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాలో ఘట్టమనేని కుటుంబం మొత్తం కనిపించనున్నారంటూ ఆ మధ్య వచ్చిన వార్తలలో వాస్తవం ఉందని ఫిలింనగర్లో వినిపిస్తోంది.
ఇప్పటికే అక్కినేని కుటుంబానికి ‘మనం’ సినిమాలో మూడు తరాలు కలసి నటించినట్టే ఈ సినిమాలోనూ ఘట్టమనేని కుటుంబమంతా కలసి నటించనుందని యూనిట్ వర్గాలు దాదాపుగా ఖరారు చేస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితార సినిమాలో అతిథి పాత్రలో నటిస్తుండగా నిన్నటి తరం హీరో , మహేష్ బాబు అన్న రమేష్‌బాబు సైతం ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించడం ద్వారా రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఏప్రిల్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం పద్మాలయ స్టూడియోలో కొన్ని సెట్లు వేయటం ద్వారా ఘట్టమనేని కుటుంబానికి ఇబ్బందిలేకుండా చూడాలని వంశీ పైడిపల్లి.ప్లాన్ చేసాడని సమాచారం.