వ్యాపారి బంపర్ ఆఫర్…ఉచితంగా ఉల్లిగడ్డలు

ఆకాశాన్నంటిన ధరలతో ఉల్లిగడ్డలు ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్న తరుణంలో మహారాష్ట్రలోని ఉద్గిరి పట్టణానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన వస్త్ర దుకాణంలో వెయ్యిరూపాయల విలువ గల వస్త్రాలు కొంటే కిలో ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.ఉద్గిరి పట్టణానికి చెందిన వస్త్రవ్యాపారి ప్రేంరాజ్పాల్ క్వింటాల్ ఉల్లిగడ్డలు కొనుగోలు చేశారు. పదివేల రూపాయల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తామని చెప్పి షాపు ముందు బ్యానర్ కట్టారు. వెయ్యిరూపాయల వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు ఉచితంగా ఇస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతోపాటు ఉల్లిగడ్డల బంపర్ ఆఫరు ప్రకటించడంతో ప్రేంరాజ్పాల్ వ్యాపారం ఊపందుకుంది.