జగన్‌ రాజమండ్రి పర్యటన వాయిదా
సీఎం జగన్‌ రాజమండ్రి పర్యటన వాయిదా పడింది. ఆయన శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు శుక్రవారం హాజరుకావాల్సిన నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో శనివారం పర్యటించ నున్నారని అధికారిక వ‌ర్గాల స‌మాచారం. 

వాస్త‌వానికి శుక్రవారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించాలనేతొలుత షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం వరకూ ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారు కాక పోవ‌టంతో జ‌గ‌న్ కోర్టుకు హాజ‌రీపై అనుమానాలు క‌లిగాయి. రెండు వారాల క్రితం ఈడీ కోర్టు జనవరి 31న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేన‌న్న ఆదేశాల‌తో ఆయ‌న విచార‌ణ‌ల‌కు హాజ‌ర‌వుతునే… దీనిపై గత వారం హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ మళ్లీ వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత దాఖలు చేయలేదు. 

వ్యక్తిగత హాజరు మినహాయింపుకోసం హైకోర్టులో పిటిషన్ ఉండటంతో జగన్ తరపు లాయర్లు కోర్టులో ఆప్సెంట్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో సీబీఐ కోర్టు కు  శుక్రవారం హైదరాబాద్‌లో హాజరుకావాల‌ని నిర్ణ‌యించుకోవ‌టంతో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభం వాయిదా ప‌డింది.

Leave a Reply

Your email address will not be published.