స్టార్లూ.. ల‌వ్ ఫెయిల్యూర్లు.. కార‌ణాలు తెలిస్తే షాకే

సినీ సెల‌బ్రెటీల జీవితాల్లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లనేది చాలా స‌హ‌జంగా జ‌రిగిపోతాయి. వాళ్ళు ఎంత త్వ‌ర‌గా క‌లుస్తారో అంతే త్వ‌ర‌గా విడిపోతారు కూడా. అలాగే కొంత మంది చివ‌రి వ‌ర‌కు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు ఇక అది వేరే విష‌యం. అప్ప‌ట్లో ల‌వ‌ర్ బాయ్ అయిన త‌రుణ్‌, ఆర్తిఅగ‌ర్వాల్ నువ్వులేక నేను లేను చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసింది. ఆ స‌మంలో వారిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని త‌రుణ్ వ‌ల్లే ఆమె గ‌ర్భ‌వ‌తి కూడా అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌పోతే వారిద్ద‌రి ప్రేమ‌ను త‌రుణ్ త‌ల్లి అయిన రోజార‌మ‌ణి ఒప్పుకోలేద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత విశాల్, శ‌ర‌త్‌కుమార్ వ‌ర‌ల‌క్ష్మీ కూడా ప్రేమించుకున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే వారివివాహానికి శ‌ర‌త్‌కుమార్ ఒప్పుకోలేద‌ని దానికి వ్య‌తిరేకంగా న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో ప‌నిచేసి శ‌ర‌త్‌కుమార్‌ను ఓడించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇక వ‌ర‌ల‌క్ష్మితో బ్రేక‌ప్ అయ్యాక అమీషాతో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడు విశాల్‌. ఇక వ‌ర‌ల‌క్ష్మి కూడా కెరియ‌ర్ పైనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి లేడీ విల‌న్‌గా, లేడీ ఓరియంటెడ్ పాత్ర‌లు పోషిస్తూ త‌న స‌త్తా చాటుకుంటుంది. ఇక 20 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన మ‌ద‌గ‌రాజా చిత్రం విడుద‌ల‌కి ముందే ఆగిపోయింది.

త‌మిళ హీరో శింభు గురించి ప్ర‌త్యేకంగా చప్ప‌క్క‌ర్లేదు. ఎంద‌రితోనో ప్రేమాయణం న‌డిపారు. న‌య‌న్‌తార‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి చివ‌ర పెళ్లి విష‌యం వ‌చ్చేస‌రికి న‌య‌న్ ప్రభుదేవాతో ఫిక్స్ చేసుకుంది. ప్ర‌భుదేవ న‌య‌న్  కోసం త‌న భార్య పిల్ల‌ల‌ను సైతం దూరం చేస‌కున్నాడు. భారీగా భ‌ర‌ణం ఇచ్చి వ‌దిలించుకున్నాడు. బోల్డ్ హీరోయిన్ అమ‌లాపాల్, విజ‌య్ ఈ జంట ప్రేమించి పెళ్ళి చేసుకుని త‌ర్వాత విడిపోయారు.

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అంజ‌లికి జ‌ర్నీ ఫేం జై తో ఎఫైర్ న‌డిచింది. ఆమె కాస్త లావుగా ఉండ‌డం వ‌ల్ల అవ‌కాశాలు త‌గ్గాయి. దాంతో ఆమె స‌న్న‌బ‌డ‌డానికి ట్రై చేస్తుంద‌ని తెలిసి ఆమెను వ‌దిలేశాడ‌ని అన్నారు. మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రెజీనా కూడా ఘాడ‌మైన ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌లు రెజీనా కెరియ‌ర్ పైన కూడా ప‌డ్డాయి. చివ‌రికి త‌న‌కు ఎవ‌రితోనూ ప్రేమాయ‌ణం లేద‌ని సాయిధ‌ర‌మ్‌తేజ్ చెప్పారు. ఇక అక్కినేని అఖిల్, శ్రియాభోపాల్‌ల ప్రేమ ఎంగేజ్‌మెంట్ వ‌ర‌కు వ‌చ్చి ఇద్ద‌రి మ‌ధ్య బేధా అభిప్రాయాల వ‌ల్ల పెళ్ళి క్యాన్సిల్ అయింది. అలాగే ఛార్మీ, ద‌ర్శ‌కుడు పూరి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Leave a Reply

Your email address will not be published.