తిరుప‌తిలో మందు బంద్‌… ఒక్క జ‌గ‌న్ వ‌ల్లే సాధ్య‌మా…?

ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీవెంకటేశ్వరుని దివ్యక్షేత్రం ఉన్న తిరుపతిలో మధ్యాన్ని నిషేధించ‌నున్న‌ట్లు ఇటీవ‌లె టీటీడీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే దానికి అంద‌రూ చాలా ఆనంద‌ప‌డ్డారు. అంద‌రూ ఈ రూల్ పెట్టినందుకు చాలా ఆహా.. ఓహో అంటూ తెగ పొగ‌డ్త‌లు కూడా వ‌చ్చాయి. అంత మంచి నిర్ణ‌యాన్ని తీసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌లుచుకుంటే చేస్తార‌ని.. ఆయ‌న మాటంటే మాటేన‌ని అంద‌రూ చాలా అనుకున్నారు. ఈ ప్ర‌తిపాద‌న ఇలా ఉండ‌గానే తీరా రెండు నెల‌లు గ‌డిచేస‌రికి సీన్ మారిపోయింది.  మళ్లీ టీడీపీనే… తిరుపతి మొత్తం మద్యనిషేధం వద్దంటూ.. కొత్త పాట అందుకుంది. అలిపిరికి వెళ్లే మార్గాల్లో మాత్రం.. మద్యం షాపులు లేకపోతే చాలని.. ఓ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. మొదట తిరుపతికి 10 కిలోమీటర్ల పరిధిలో..మద్యపాన నిషేధం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. చివరికి .. అలిపిరికి వెళ్లే రూట్లకు పరిమితం అయింది.

 తిరుపతిలో మద్య, మాంసాలను నిషేధించాలనేది.. చాలా కాలంగా ఉన్న డిమాండ్ ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే  రోజుకు.. లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది తిరుమలలో శ్రీనివాసుడ్ని మాత్రమే చూసి వెనుదిరగడం లేదు. శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం.. శ్రీకాళహస్తి వంటి ప్రాంతాలకూ వెళ్తూంటారు. అందుకే.. తిరుపతిలో.. ఎక్కువగా భక్తులే కనిపిస్తుంటారు. వీరి భక్తి ప్రపత్తులను గౌరవించడానికైనా.. సిటీలో మద్య, మాంసాలను నిషేధించాలన్న డిమాండ్ ఉంది. ఇది సాధ్యం కాదని.. గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం కాస్త‌ పట్టించుకున్నట్లుగా కనిపించింది.  మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాస్త గ‌ట్టిగా ప‌ట్టించుకుని ఏదైనా భ‌క్తుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా సానుకూలంగా స్పందిస్తే బావుంటుందని ప‌లువురు భావిస్తున్నారు. కానీ గ‌త ప్ర‌భుత్వాలు ఏవీ కూడా ఈ విష‌యం పై పెద్ద‌గా స్పందించ‌లేదు. మ‌రి వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.