మ‌రో బ‌యోపిక్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌

బాలీవుడ్ నటి విద్యా బాలన్ బయోపిక్ చిత్రాలకు ఆప్షన్ లా మారింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంతో పాటు తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా నటించనున్నారు.

ఇక ఇప్పుడు విద్యా తాజాగా మరో బయోపిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని సమాచారం. హ్యూమన్ కంప్యూటర్ , ప్రముఖ మ్యాథమేటీషియన్ శంకుతల దేవి జీవితం ఆధారంగా తెరకెక్కనుంది ఈ చిత్రం. ఈచిత్రంలో శంకుతల దేవి పాత్రలో విద్యా బాలన్ కనిపించనున్నార‌ని స‌మాచారం. అను మీనన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది

Leave a Reply

Your email address will not be published.