సామంత రాజులైన ఎమ్మెల్యేలు – మండి పడుతున్న సీనియర్లు

గత ఎన్నికలలో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ… తాజాగా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్తగా తొలిసారి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చేస్తున్న హడావిడి…అంతా ఇంతా కాదు. సొంత పార్టీ వాళ్లు సైతం తమకు తెలియకుండా తమ నియోజకవర్గాలలోసొంత పనులున్నా అడుగు పెట్టకూడదన్న చందంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే..అ’ధిక్కార’మదం గట్టిగానే కనిపిస్తున్నట్టు ఆ పార్టీలోని వారే వాపోతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలలో జరిగిన దాడులు, ప్రతి దాడులు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ తరహాలో చాలా నియోజక వర్గాలలో ఎంపీలకు, ఎమ్మేల్యేలకు, ఎమ్మెల్యేలకు మాజీలకు, స్థానిక నేతలకు మధ్య పెద్ద పెద్ద అగాధాలే ఏర్పడుతున్నాయని, ఇది పార్టీపై ప్రభావం చూపే ఆస్కారం ఉందన్నది పార్టీలోని కొందరు సీనియర్ల మాట.
ఇక తొలి సారి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, తాము ఓ రాజ్యానికి సామంత రాజులమని, మనం ముఖ్యమంత్రికి తప్ప ఎవరికీ భయపడనక్కర్లేదంటూ, సొంత గణాలనే ప్రోత్సహిస్తున్నారని, .అటు ప్రభుత్వ అధికారులపై…ఇటు పార్టీలో సీనియర్స్ పై జులుం ప్రదర్శింప చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో తమ గెలుపుకు ఆధారం అయినవారంతా ఇప్పుడు ఇప్పుడు అదంతా తమ బలుపు అంటూ వివాదాలకు దిగటంతో స్థానిక ఎన్నికలలో చుక్కలు చూపించడం ఒకటైతే…. అధిష్టానానికి తలనొప్పులు తెప్పించడటం ఖాయమని వైఎసార్సీపీ వర్గాలే లబో దిబో మంటూ ఉండడం విశేషం.
ఇప్పటికే ఈ స్థానిక ఎన్నికల్లో..ఏమాత్రం తేడా వచ్చినా..అసలుకే మోసం వస్తుందని, మంత్రి పదవులకు సైతం గండం తప్పదని. హెచ్చరికలతో కొందరు పదవులపై కన్నేసి నియోజకవర్గంలో చేస్తున్న హల్చల్ తో సీనియార్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ జూనియర్ నాయకులు సొంత పెత్తనం పక్కన పెడతారా? లేక జగన్ మాటను జుజుబీ అంటూ…వదిలేస్తారా..చూద్దాం.