ఆనంకు వైసిపి షోకాజ్ ఇస్తుందా?

ఒక‌ప్పుడు వైఎస్ హ‌యాంలో ఓ వెలుగు వెలిగి, నెల్లూరు పెద్దారెడ్డిగా పేరొందిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి తాజాగా రాజేసిన మాఫియా అగ్గి వైసీపీలో ముస‌లం పుట్టించేలానే క‌నిపిస్తోంది. నెల్లూరులో  వైసిపి రెండు గ్రూపులుగా చీలిపోయింది. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే  ఆనం, కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి ఇద్ద‌రూ ఒక వ‌ర్గంగా మంత్రి అనిల్ కుమార్‌, కోటం డ్ర‌ద‌ర్స్ మ‌రోగ్రూపుగా  యుద్ధానికిసిద్ద‌మ‌న్న తీరుగా సిగ‌ప‌ట్లు ప‌డుతునే ఉన్నారు. ఒక‌రి వ్య‌వ‌హారంలో మ‌రొక‌రు జోక్యం చేసుకుంటూ త‌ర‌చూ ఆధిప‌త్య పోరు ప్ర‌ద‌ర్శిస్తునే ఉన్నారు.
అనం – అనిల్‌కుమార్ మ‌ధ్య అంత‌ర్గ‌త విబేధాలు  మిగిలిన జిల్లాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే ఆందోళ‌న వైసిపిలో క‌నిపిస్తోంది. మైనింగ్‌, ల్యాండ్ మాఫియాతోపాటుగా.. బెట్టింగ్‌లు కూడా విప‌రీత‌మ‌య్యాయని, స‌రైన పోలీసు అధికారి లేకపోవ‌టం వ‌ల్లే మాఫియా మ‌రింత రెచ్చిపోతున్నారంటూ  ఆనం పేరు ప్ర‌స్తావించ‌కుండా చేసిన వ్యాఖ్య‌లు మంత్రి అనిల్‌ను సూటిగా తాకిన‌ట్టుంది.
ఆనం వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రికి వారే భుజాలు త‌డుముకోవటం, మంత్రి వ‌ర్గంలో కీల‌క‌మైన అనిల్‌ను ల‌క్ష్యం చేసుకోవ‌టాన్ని జ‌గన్ జీర్ణించుకోలేక‌పోయారు  పార్టీ వేదిక‌పై కాకుండా మీడియాలో మాట్లాడిన ఆనంకు రేపోమాపో నోటీసులు జారీచేసి స‌మాధానం తీసుకోవాల‌ని ఆదేశాలిచ్చిన‌ట్టు తెలుస్తోంది. అటు విజ‌య‌సాయిరెడ్డి కూడా స్పందించి అధినేత గీసిన లైన్ దాటితే వేటే అన్న స్ధాయిలో మాట్లాడారు. ఈ  క్ర‌మంలోనే ఆనంకు వైసీపీ నుంచి షోకాజ్‌నోటీసులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఒక వేళ షాకాజ్ వ‌స్తే,  ఆనం ఎలా ప్ర‌తిస్పందిస్తారు. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వైసిపిలో ఉత్కంఠ‌త‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.