వ‌రుస విజ‌యాల‌తో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను సాధించుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్…

వ‌రుస విజ‌యాల‌తో , సంచ‌ల‌న చిత్రాల‌తో తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌శ్రేణి నిర్మాత‌ల‌లో ఒక‌రిగా ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప‌రిశ్ర‌మ‌కు చేసిన‌ సేవలకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ వ‌రించింది.  సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాజీ రాష్ట్ర‌ప‌తి  ప్రణబ్ ముఖర్జీ   అల్లు అరవింద్ కు ఈ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ ను ప్రధానం చేశారు.
కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని సంస్ధ సోషియల్ డెవలప్మెంట్ మరియు కమ్మునిటీ సర్వీస్ చేసిన వారికి అవార్డులందించేందుకు భార‌త ప్ర‌భుత్వ‌ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.జీ బాలకృష్ణన్,  మాజీ సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ గ్యాన్ సుధ మిశ్రా  ల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది.  ఈ అవార్డ్స్ కోసం ఈ క‌మిటీ నలుగురు ముఖ్యమంత్రు లు, క్రీడా కారుల‌ను  ఎంపిక చేసింది, వీరితో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు కూడా ఈ అవార్డు అందించేందుకు ఎంపిక చేయ‌గా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో   అల్లు అరవింద్ ఈ అవార్డ్ అందుకోవడం విశేషం.
అల్లు అరవింద్  తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ చిత్రాల నిర్మాత‌గా అందరికి సుపరిచితమే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆయ‌న ప‌లు చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్, చిరంజీవి, అనిల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోస్ తో హీరోలతో సినిమాలు తీసారు.  అనేక  అద్బుతమైన చిత్రాలు రూపొందించిన‌ ఆయన త‌న  చిత్రాల ద్వారా అనేక‌ అవార్డ్స్, రివార్డ్స్  అందుకున్నారు.  

Leave a Reply

Your email address will not be published.