‘పెట్రోల్ కొంటె ఉల్లి’ బంపర్ ఆఫర్

దేశీయంగా ఉల్లి ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో దీనిని బంప‌ర్ ఆఫ‌ర్‌గా వాడుకుంటున్నారు కొంద‌రు వ్యాపారులు. కార్లు, బెకులు, టీవీలు, ఫ్యాన్‌లు, రిఫ్రిజిరేటర్లు ఇలా ఖరీదైన వస్తువులకే ఇంత‌వ‌ర‌కు లక్కీ డ్రాలు నిర్వ‌హించ‌గా తాజాగా ఉల్లిని కూడా ఇందులో చేర్చిలక్కీ డ్రా ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టేసాడో ఓ పెట్రోల్‌ బంకు య‌జ‌మాని. విజయనగరం పట్టణంలోని ఓపెట్రోల్ బంక్ యాజ‌మాన్యం ఈ మేర‌కు బంక్ ముందు ఓ ప్ర‌క‌ట‌న ఫ్లెక్సీని ఉంచింది. రూ.200 పెట్రోల్‌ వేయించుకున్నవారికి ఒక కూపన్‌ అందించ‌డంతో పాటు ప్ర‌తి రోజు సాయంత్రం ఈ కూప‌న్ల‌న్ని డ్రా తీసి విజేత‌లైన‌ ఇద్దరికి క‌స్ట‌మ‌ర్ల‌కు రెండు కిలోలు చొప్పున ఉల్లిపాయలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఈ బంక్‌లో పెట్రోల్ పోయించుకునడంతో పాటు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించేందుకు వాహ‌న‌దారులు క్యూకడుతున్నారు. 
బంపర్‌ డ్రాగా వచ్చేనెల 26న గణతంత్ర దినోత్సవం రోజున డ్రా తీసి విన్నర్‌కు మొదటి, రెండు, మూడు బహుమతులుగా కారు, బైక్‌, ఫ్రిజ్ ప్ర‌క‌టించిన యాజ‌మాన్యం ఆరో బహుమతిగా ఏకంగా 10కిలోల ఉల్లిపాయల పార్సిల్‌ను అందిస్తామని చెప్ప‌డం విశేషం. ఐడియా బాగుంది క‌దూ…

Leave a Reply

Your email address will not be published.